‘వారణాసి’ని రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఎన్నో భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ ఇప్పటికే ఉంది. కానీ మహేష్ అభిమానులకు మరో పాయింట్ ఇప్పుడు డౌట్ క్రియేట్ చేస్తోంది. సినిమాలో రుద్రగా మహేష్ కనిపించడం ఒక విషయం అయితే.. ఇతర భాషల్లో కూడా ఆయన వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఎన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెబుతారన్నదే ఇప్పుడు అసలైన విషయం.

మహేష్‌కు తమిళంలో మాత్రం ఇప్పటికే అనుభవం ఉంది. ‘స్పైడర్’ తమిళ వెర్షన్‌కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కింది. తమిళ ప్రమోషన్స్ సమయంలో కూడా మహేష్ అక్కడి ప్రేక్షకులతో నేరుగా మాట్లాడారు. అంటే తమిళం విషయంలో ఆయనకు పెద్దగా కొత్తేమీ లేదు.

కానీ హిందీ విషయంలో పరిస్థితి పూర్తిగా కొత్తది. మహేష్ ఇప్పటివరకు హిందీ సినిమా చేయలేదు. అందుకే ‘వారణాసి’ కోసం హిందీలో కూడా స్వయంగా డబ్బింగ్ చెబితే అది ఆయన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అవుతుంది. పైగా రాజమౌళి తన మెయిన్ హీరోలతో వీలైనన్ని భాషల్లో వాళ్లే డబ్బింగ్ చెప్పించడానికి ఇష్టపడతారు. ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడలో కూడా డబ్బింగ్ చెప్పించారు.

అందుకే మహేష్‌తో కూడా అదే రూట్‌లో వెళ్తారా అన్నది చూడాలి. తమిళం వరకు ఆయన చేసేయగలడు. హిందీ కోసం మాత్రం ప్రాక్టీస్ అవసరం కావచ్చు. కన్నడ లేదా మలయాళంలో కూడా ప్రయత్నిస్తారా? లేక తెలుగు, తమిళం, హిందీ వరకు మహేష్ వాయిస్ ఉంచి మిగతా భాషలకు డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకుంటారా? ప్రస్తుతం దీనిపై టీమ్ నుంచి క్లారిటీ లేదు.

Leave a Reply

Join the Frontpage Family

Get the latest political news, updates, and insights from Andhra Pradesh & Telangana delivered straight to your inbox.

You May Also Like

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే.…

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన…

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం.…

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో…