టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనతను అందుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్ ఇండియా’ ప్రత్యేక సంచిక కవర్‌ పేజీపై మెరిశారు. 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ వంటి వివిధ రంగాల్లో విశేష ప్రభావం చూపిన 100 మంది తారల జాబితాను ‘షో స్టాపర్స్ – 2026’ పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో రాంచరణ్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి చాలామంది దిగ్గజాలు ఉన్నప్పటికీ కవర్ పేజీ కోసం మాత్రం బన్నీనే సెలెక్ట్ చేయడం విశేషం.

అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూని రూ. 1522 కోట్లుగా లెక్కగట్టిన ఫోర్బ్స్, ఈ జాబితాలో పదో స్థానాన్ని ఇచ్చింది. అంతేకాదు టాలీవుడ్లో అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్నది కూడా అల్లు అర్ునే అని నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ తో పాటు రాంచరణ్ కు మాత్రమే ఈ లిస్టులో స్థానం దక్కింది. ఫస్ట్ ప్లేస్ ను రూ.3542 కోట్ల బ్రాండ్ వాల్యూ తో విరాట్ కోహ్లి దక్కిచుకోగా, రెండో స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు.

పుష్ప, పుష్ప 2 తో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న అల్లు వారబ్బాయి ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీని చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Join the Frontpage Family

Get the latest political news, updates, and insights from Andhra Pradesh & Telangana delivered straight to your inbox.

You May Also Like

మోడీ వెళ్లొచ్చు గానీ.. నేను వెళ్లకూడదా?

మోడీ సమాధానం చెప్పాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ప్రధాని మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు…

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

రాష్ట్రంలో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ దుమారానికి చెక్ పెట్టే ఆసక్తి కర సంఘటన సీఎం…

కొండా కుటుంబానికి రెట్టింపు దెబ్బ – అరెస్టులు, నిరాకరణలు, పార్టీలో ఒంటరితనం

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ…