H1B వీసాలపై ఎప్పటినుంచో గగ్గోలుపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాటిని కంట్రోల్ చేయడానికి తాను ప్రతిపాదించిన లక్ష డాలర్ల ఫీజు అమలుకు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై తాజాగా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈమెయిల్స్ పంపించడం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి దీనిని ప్రతిపాదనగానే చెబుతున్నా ఎప్పుడు అమలు చేస్తారో అన్న ఆందోళన టెకీల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా H1B వీసాపై ఆధారపడిన భారత ఉద్యోగుల్లోఎక్కువగా టెన్షన్ కనిపిస్తోంది.

అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) జారీ చేసిన తాజా ముసాయిదా ప్రకారం H1B వీసాకు ప్రస్తుతం ఉన్న రుసుముతో పాటు అదనంగా లక్షా 3 వేల 265 డాలర్ల ఫీజును వడ్డించబోతున్నారు. ప్రస్తుతం ఏటా 85వేల H1B వీసాలను ఇస్తుండగా, కొత్తగా ప్రతిపాదించిన ఫీజు ప్రకారం 8.8 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ట్రంప్ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ ఆదాయాన్ని దేశంలో చట్టబద్ధంగా నివసిస్తున్న విదేశీయుల వ్యవహారాల నియంత్రణకు ఉపయోగిస్తామంటూ ముసాయిదా లో పేర్కొంది. అయితే గతంలో H1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజును ట్రంప్ వేయగా, కోర్టులు దాన్ని కొట్టివేశాయి. దీంతో దాన్ని మరో రూపంలో అమలు చేయడానికి ట్రంప్ సర్కార్ ఈ ప్రతిపాదన తెచ్చింది. దీనిపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం సేకరించి, ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఆదాయాన్ని అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ నిర్వహణకు ఉ
నిబంధనలు అంతర్జాతీయ ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతంలో విధించిన తాత్కాలిక రుసుము గడువు ముగియనున్న నేపథ్యంలో, ఈ పెంచిన ఖర్చును చట్టబద్ధంగా శాశ్వతం చేసేందుకు ట్రంప్ పరిపాలన ప్రయత్నిస్తోంది.